Central Govt Post: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

by Indraja |
Central Govt Post: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు
X

దిశ వెబ్ డెస్క్: ఉద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడుతున్న నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 1377 ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ సుపరిచితమే. అయితే ఆ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీలు ఉన్నట్లు గతంలో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే ఆ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. అయితే ఆఖరి నిమిషంలో కేంద్రం ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పొడిగించారు. కాగా వివిధ విభాగాలన్నింటిలో కలిపి మొత్తం 1377 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వయోపరిమితి, పోస్టులు, అలానే ఇతర సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Advertisement

Next Story