- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CRPF నుంచి భారీ నోటిఫికేషన్.. మొత్తం 9360 కానిస్టేబుల్ పోస్టులు
దిశ, కెరీర్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9360 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే తొలుత 9212 పోస్టులను భర్తీ చేయనున్నట్లు CRPF ప్రకటించింది. తాజాగా 148 పోస్టులను అదనంగా కలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 9360కి చేరింది.
దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా పేర్కొనగా, తాజాగా దరఖాస్తు గడువును మే 2 వ తేదీ వరకు పొడిగిస్తూ CRPF సీఆర్‌పీఎఫ్ నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 2వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
పురుషుల పోస్టులు: మోటార్ మెకానిక్, డ్రైవర్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి.
మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రెస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్ తదితర పోస్టులున్నాయి.
విద్యార్హతలు: పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు,యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.
హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఇంకా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వయసు : పోస్టులను అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వేతనం లభిస్తుంది.
పరీక్షా విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్):
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.
హిందీ/ఇంగ్లీష్ భాష కు 25 మార్కులు,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు మరో 25 మార్కులు.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్ కు మరో 25 మార్కులు
ఎలిమెంటరీ మ్యాథ్స్ కు 25 మార్కులు ఉంటాయి.
వేతన స్కేలు: రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ (పురుష) అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే:
ఆంధ్రప్రదేశ్: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, వరంగల్ (అర్బన్).
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 27, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2023
అడ్మిట్ కార్డు జారీ: జూన్ 20-25
CRPF కానిస్టేబుల్ పరీక్ష: జులై 1 నుంచి 13
వివరాలకు వెబ్‌సైట్: https://crpf.gov.in/