గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు, అతి త్వరలో నోటిఫికేషన్

by Harish |   ( Updated:2023-02-15 13:51:26.0  )
గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు, అతి త్వరలో నోటిఫికేషన్
X

దిశ, కెరీర్: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి.. ఏప్రిల్‌లోపే ఖాళీల భర్తీకి రాతపరీక్షలు పూర్తిచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా పంచాయతీరాజ్‌ శాఖకు లేఖ రాసింది. ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది. త్వరలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Also Read...

IDBI బ్యాంక్‌లో 114 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

Advertisement

Next Story