ఇండియన్ నేవీ‌లో 100 అగ్నివీర్(ఎంఆర్) పోస్టులు

by Harish |
ఇండియన్ నేవీ‌లో 100 అగ్నివీర్(ఎంఆర్) పోస్టులు
X

దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కిమ్‌లో భాగంగా ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎంఆర్) ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్: అగ్నివీర్ (మెట్రిక్ రిక్రూట్ -ఎంఆర్)

మొత్తం పోస్టులు: 100 (వీటిలో పురుషులు-80, మహిళలు- 20)

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: నవంబర్ 1, 2002 నుంచి ఏప్రిల్ 31, 2005 మధ్యలో జన్మించి ఉండాలి.

కనీస ఎత్తు: పురుషులు 157 సెం.మీ, స్త్రీలు - 152 సెం.మీ ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (సీబీటీ), రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ. 30,000, రెండో ఏడాది రూ. 33,000, మూడో ఏడాది రూ. 36,500, నాలుగో ఏడాది రూ. 40,000 వేతనం లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు: రూ. 550.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా నేవీ అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 29, 2023.

చివరి తేదీ: జూన్ 15, 2023.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

Advertisement

Next Story