CRPF నుంచి 9212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

by Harish |
CRPF నుంచి 9212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, కెరీర్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తాజాగా భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) పోస్టుల భర్తీ చేపడుతోంది. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష /మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 9,212

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్)

ఇందులో పురుషులకు - 9105, మహిళలకు 107 పోస్టులున్నాయి.

పురుషుల పోస్టులు:

డ్రైవర్

మోటార్ మెకానిక్

కోబ్లర్

కార్పెంటర్

టైలర్

బ్రాస్ బ్యాండ్

పైప్ బ్యాండ్

బగ్లర్

గార్డెనర్

పెయింటర్

కుక్

వాటర్ క్యారియర్

వాషర్‌మన్

బార్బర్

సఫాయి కర్మచారి.

మహిళా పోస్టులు:

బగ్లర్

కుక్

వాటర్ క్యారియర్

వాషర్‌మన్

బార్బర్

సఫాయి కర్మచారి

బ్రాస్ బ్యాండ్.

అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.

పురుషులు 170. సెం.మీల ఎత్తు కలిగి ఉండాలి.

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ 21,700 నుంచి రూ. 69,100.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 27, 2023.

చివరి తేదీ: ఏప్రిల్ 25, 2023.

పరీక్ష తేదీలు: జులై 1, 2023 నుంచి జులై 13, 2023.

వెబ్‌సైట్: https://crpf.gov.in

Advertisement

Next Story