టీచర్ పోస్టుల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

by Harish |
టీచర్ పోస్టుల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, కెరీర్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త .. తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో భారీ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. మొత్తం 4006 టీజీటీ పోస్టుల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను బోర్డు విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 4006

పోస్టుల వివరాలు:

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS)- 218

తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) -728

మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(MJPTBCWREIS)-2379

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS)- 594

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TREIS)- 87

అర్హతలు: పోస్టులను అనుసరించి విద్యార్హతలు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉండాలి.

వయసు: జులై 1 నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.

నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

వేతనం: ఎంపికైన వారికి రూ.42,300 - రూ.1,15,270 ఉంటుంది.

వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in

Advertisement

Next Story