- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,654 జేఎల్ పోస్టులు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,654 గెస్ట్ లెక్చరర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి లెక్చరర్లను ఎంపిక చేయాలని ఇంటర్ విద్యాశాఖ జులై 19న ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పీజీ మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితాను జులై 27న ప్రకటిస్తారు. తుది ఎంపిక జులై 28న చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 1 లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
పోస్ట్ పేరు: గెస్ట్ లెక్చరర్లు
మొత్తం పోస్ట్‌లు: 1,654
జిల్లాల వారీగా ఖాళీలు: సిరిసిల్ల-27, జనగామ -33, గద్వాల -40, వనపర్తి -48, భద్రాద్రి కొత్తగూడెం -45, సిద్దిపేట -69, కామారెడ్డి -78, నిజామాబాద్-58, మహబూబాబాద్-21, మెదక్-68, నాగర్‌కర్నూల్ -67, సూర్యాపేట -17, వికారాబాద్ -59, సంగారెడ్డి-101, మేడ్చల్-24, ఆసిఫాబాద్-61, వరంగల్-19, ఖమ్మం-42, హనుమకొండ -17, జగిత్యాల -51, కరీంనగర్-28, నల్గొండ-53, మంచిర్యాల-37, ఆదిలాబాద్ -63, పెద్దపల్లి- 42