ఇండియన్ నేవీ‌లో 1365 అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. ఎంపిక ఎలాగంటే..!

by Harish |
ఇండియన్ నేవీ‌లో 1365 అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. ఎంపిక ఎలాగంటే..!
X

దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కిమ్‌లో భాగంగా ఇండియన్ నేవీ అగ్నివీర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్: అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్ - ఎస్ఎస్ఆర్)

మొత్తం పోస్టులు: 1365 (దీనిలో పురుషులు-1120, మహిళలు- 273)

అర్హత: మ్యాథ్స్,ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా.. కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: నవంబర్ 1, 2002 నుంచి ఏప్రిల్ 31, 2005 మధ్యలో జన్మించి ఉండాలి.

కనీస ఎత్తు: పురుషులు 157 సెం.మీ, స్త్రీలు - 152 సెం.మీ ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (సీబీటీ), రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ. 30,000, రెండో ఏడాది రూ. 33,000, మూడో ఏడాది రూ. 36,500, నాలుగో ఏడాది రూ. 40,000 వేతనం లభిస్తుంది.

సీబీటీ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది.

ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 1 గంట ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు 1 మార్కు కోత విధిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 550 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 29, 2023.

చివరి తేదీ: జూన్ 15, 2023.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

Advertisement

Next Story