- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SSC నుంచి 1324 జూనియర్ ఇంజనీర్ పోస్టులు
దిశ, వెబ్‌డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC) కొత్తగా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం ప్రకటన విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లలో ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు జలవనరుల శాఖ, ఓడరేవులు, షిప్పింగ్, సైనిక ఇంజనీరింగ్ తదితర విభాగాల చోట్ల పనిచేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం పోస్టులు: 1324.
అర్హత: పోస్టులను బట్టి అభ్యర్థులు సివిల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మెకానికల్ విభాగాల్లో డిప్లొమా/ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: రూ.100
SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
వయస్సు: గరిష్ట వయోపరిమితి: 32 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉన్నాయి.
జీతం: నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400.
దరఖాస్తు చివరి తేదీ: 16-08-2023
వెబ్‌సైట్: https://ssc.nic.in/
నోటిఫికేషన్: https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/NOTICE_JE_2023_26072023.pdf