విద్యాశాఖలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి..

by Shyam |
విద్యాశాఖలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఓయూ, టీఎస్ జేఏసి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డీఎస్సీ, జేఎల్, డీఏల్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులతోపాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరిపోయినంతగా బోధన, బోధనేతర సిబ్బంది లేక పాఠశాల విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకోలేక పోతున్నారని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

Advertisement

Next Story