- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాధి కంటే ఉద్యోగ భయమే ఎక్కువ!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ఒక వినాశనాన్ని సృష్టించింది. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశీయంగా కూడా దీనికేమాత్రం తీసిపోలేదు. నెల రోజులుగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అన్ని రకాల వ్యాపారాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంలో ఇండియాలోని ప్రజలకు ప్రధానంగా ఉన్న భయం గురించి లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక తయారు చేసింది. సుమారు 17,000 మంది నుంచి వివరాలు సేకరించిన ఈ సర్వేలో 10 మందిలో ముగ్గురు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అధిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు.
రాబోయే ఏడాది వరకూ ఇంటికవసరమైన ఆదాయం తగ్గిపోతుందనే భయమున్నట్టు 10 మందిలో 9 మంది ఆందోళన వ్యక్తం చేశారు.
సర్వేలో పాల్గొన్న అందరినీ మొదట అడిగిన ప్రశ్న..లాక్‌డౌన్ సమయంలో దేని విషయంలో ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్నారు అని. వారిలో 31 శాతం మంది ఉద్యోగం, వ్యాపారం, ఫైనాన్స్ విషయాల గురించి భయపడుతున్నామని చెప్పగా, 11 శాతం మంది ఇంటికి అవసరమైన సామగ్రిని సేకరించే విషయంలో ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. 26 శాతం మంది టీవీల నుంచి, సోషల్ మీడియాల నుంచి వ్యతిరేక వార్తలు, వదంతులు ఎక్కువ ఒత్తిడిని కలగజేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదే ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారందరిలో 24 శాతం మంది మాత్రమే కరోనా సోకుతుందనే భయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అంటే, ఇండియాలో ఒక మహమ్మారి వ్యాధి గురించి ఆందోళన కంటే ఆర్థికపరమైన, జీవనోపాధి గురించే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని తెలుస్తోంది. ‘సర్వేలో పాల్గొన్న ప్రజలు ఆందోళనకు గురయ్యేందుకు అనేక విషయాలు ప్రభావితం చేస్తున్నాయని, వారికి వ్యాధి బారిన పడతామనే భయం పెద్దగా ఒత్తిడికి గురి చేయట్లేదు. ఇంటికి నడపటం, ఉద్యోగాన్ని కాపాడుకోవడం, వ్యాపారం నష్టపోకుండా నిర్వహించుకోవడం ఇండియాలోని ప్రజలకు ఒత్తిడిని గురిచేసే ప్రధాన కారణాలుగా ఉందని’లోకల్ సర్కిల్స్ నివేదిక స్పష్టం చేసింది. మరో ఏడాదిపాటు ఇంటికి అవస అవసరమైన ఆదాయం సగానికిపైగా తగ్గుతుందని 26 శాతం మంది చెప్పారు. 25 శాతం మంది తమ ఆదాయం 25 నుంచి 50 శాతం తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందని కేవలం 2 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారందరిలోని పది మందిలో ఒకరు మాత్రమే కరోనా వైరస్ తమ ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపించదని భావిస్తున్నారు.
Tags: coronavirus, grocery, jobs, LocalCircles Survey