హైదరాబాద్ యువత దేశానికి ఆదర్శం కావాలి: సీపీ అంజనీ కుమార్

by Sridhar Babu |   ( Updated:2021-11-27 09:49:36.0  )
CP-ANJi
X

దిశ, చార్మినార్: హైదరాబాద్​యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నిరుద్యోగ యువతీయువకులు తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సౌత్​జోన్​పోలీసుల ఆధ్వర్యంలో బండ్లగూడలోని ఓఎస్ గార్డెన్​లో శనివారం నిర్వహించిన మెగా జాబ్​మేళాలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతీయువకులు చెడు మార్గంలో పయనించకుండా జీవనోపాధి కల్పించడం కోసం నగరంలోని అన్ని ప్రాంతాలలో జాబ్ మేళా నిర్వహిస్తూ వారికి ఉద్యోగ​వకాశాలు కల్పిస్తున్నామన్నారు. అన్ని జోన్​లలో జాబ్​కనెక్ట్ మేళాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గడిచిన మూడేళ్లలో సిటీ పోలీసుల ఆధ్వర్యంలో 21 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. ఝాన్సీ బజార్​మహిళా పోలీస్​స్టేషన్​లోనూ ఇటీవల మహిళల కోసం జాబ్​మేళాను నిర్వహించామన్నారు. ఈ జాబ్​మేళాలను అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం జాబ్​మేళాలో ఎంపికైన 299 మంది నిరద్యోగులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఐ గ్రూప్​ మార్కెటింగ్​జనరల్​మేనేజర్ అర్చన, సీఏఆర్​హెడ్​క్వార్టర్స్​అడిషనల్​పోలీస్​కమిషనర్​విక్రమ్​సింగ్, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, అడిషనల్​డీసీపీ సయ్యద్​రఫిక్, ట్రాఫిక్​డీసీపీ రాములు నాయక్, ఫలక్​నుమా ఏసీపీ మాజీద్, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఫలక్​నుమా, షాలిబండా ఇన్​స్పెక్టర్లు కె.ఎన్​ప్రసాద్​వర్మ, సయ్యద్​అబ్దుల్​ఖాదర్​జిలానీ, ఆర్. దేవేందర్, శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story