- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనమే గెలవబోతున్నాం : బైడెన్
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దానికి తోడు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ కోర్టులను ఆశ్రయించడం వలన కూడా ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే తప్పకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించిన ట్రంప్.. అదే సంకల్పంతో ముందుకు పోతున్నారు.
ఈ నేపథ్యంలోనే డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మాట్లాడుతూ.. తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో తన గెలుపువై పూర్తి విశ్వాసముందన్నారు. డెమొక్రటిక్ పార్టీపై అమెరికా ప్రజలు కనబరిచిన ప్రేమ మరువలేనిదని వ్యాఖ్యానించారు.