తాడిపత్రికి షాక్.. కౌన్సిలర్‌గా జేసీ నామినేషన్

by srinivas |   ( Updated:2020-03-12 05:10:04.0  )
తాడిపత్రికి షాక్.. కౌన్సిలర్‌గా జేసీ నామినేషన్
X

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి షాకిచ్చారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజం పాలైన ప్రభాకర్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

సాధారణంగా ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తులు అంతకంటే పెద్ద పదవులు, లేదా పార్లమెంటుకు వెళ్లాలని భావిస్తారు. అయితే గతంలో నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్‌గా ఆయన నామినేషన్ వేశారు. ఈ నామినేషన్‌ను కూడా ఆయన న్యాయవాదులు ఆయన తరపున దాఖలు చేయడం విశేషం. అదే వార్డు నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్దన్ రెడ్డి కూడా బరిలో నిలవడం విశేషం. ఇద్దరు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేయడంతో 30వ వార్డు కౌన్సిలర్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

కాగా, గతంలో స్థానిక ఎన్నికలపై ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే బెటర్ అన్నారు. దీనిపై పార్టీ అధినేతతో కూడా ఆయన మాట్లాడారు. అయితే ఆయన పోటీ చేయాల్సిందేనని ఆదేశించడంతో ప్రభాకర్‌రెడ్డి నిలబడ్డట్టు తెలుస్తోంది. దీనిపై జేసీ స్పందిస్తూ, తన సొంత మనుషులే తన మాటలు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జేసీ ఆవేదన వెనుక అర్థముందని తాడిపత్రి రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కౌన్సిలర్‌గా గెలుపోటములు అక్కడ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికీ వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో సమీక్షలతో ఇబ్బంది పడిన జేసీ బ్రదర్స్ తాజా నిర్ణయంతో ఓటమిపాలైతే మరిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేస్తుండగా, గెలిస్తే.. మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్‌గా గెలవడం పెద్ద విషయమా? అని ఆ విజయాన్ని తీసిపారేస్తాని పేర్కొంటున్నారు.

Tags: anantapur, tadipatri, jc brothers, jc prabhakar reddy, jc diwakar reddy, local body elections

Advertisement

Next Story

Most Viewed