- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సెల్ఫ్ లవ్’ ఇంపార్టెన్స్ వివరించిన జెన్నిఫర్ లోపెజ్
దిశ, వెబ్‌డెస్క్: మీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలోనే మీరు ప్రత్యేకమైన వారని తెలుసా? ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఇంకెవరు భూమ్మీద లేరు. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కాకుండా..మనకు మనమే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి ‘సెల్ఫ్ లవ్’ అనేది చాలా చాలా ముఖ్యం. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు, మరెన్నో సందర్భాల్లో మనం ‘సెల్ఫ్ లవ్’ కోల్పోతుంటాం. సెల్ఫ్ లవ్ మనకు ఆనందాన్నివ్వడమే కాకుండా, మనపై మనకు నమ్మకాన్ని ఇచ్చి దేన్నైన ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది. కానీ, కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు అందరికీ ‘సెల్ఫ్ లవ్’ ఓ బిగ్గెస్ట్ చాలెంజ్. ప్రముఖ అమెరికా నటి, సింగర్, డ్యాన్సర్ జెన్నిఫర్ లోపెజ్ కూడా తనను తాను ప్రేమించుకోకపోవడం వల్లే పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, వాటి నుంచి తప్పించుకోవడానికి థెరపీ సెషన్స్‌కు హాజరయ్యానని అంటోంది. అక్కడ సెల్ఫ్ లవ్ వ్యాల్యూ తెలిసిందని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ జైశెట్టి తన ‘కోచ్ కన్వర్జేషన్’ యూట్యూబ్ సిరీస్‌లో భాగంగా జెన్నిఫర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా జెన్నిఫర్ తనకు 30 ఏళ్ల వయసున్నప్పుడు ఎలాంటి బాధలను ఎదుర్కొంది, ఎలా వాటినుంచి బయటపడిందో వివరించింది. ‘ పిల్లలకు అన్నీ నేర్పిస్తుంటారు. కానీ, సెల్ఫ్ లవ్ గురించి ఎవరూ చెప్పరు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, మనపై మనకు నమ్మకం వస్తుంది. ఏదైనా సాధించడానికి ముందడుగు వేస్తాం. మీ మనసు చెప్పే మాట వినండి. నా పిల్లలకు ఎప్పుడూ అదే చెబుతాను. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకునే వరకు, స్వచ్ఛమైన, నిజమైన ప్రేమను మరొకరికి అందించలేరు. పొందలేరు కూడా. అది సాధించిన రోజు మరింతమంది ఆప్తులను పొందుతారు. నేనిప్పుడు అలాంటి ప్రేమను పొందుతున్నాను. నా విషయంలో ‘సెల్ఫ్ లవ్’ అనేది ఓ జర్నీ..ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఆ జర్నీలో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను’ అని జెన్నిఫర్ పేర్కొంది.