ఐసీసీ సీఈవోగా జెఫ్ అలార్డైస్

by Shyam |
Geoff Allardice
X

దిశ, స్పోర్ట్స్: ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జెఫ్ అలార్డైస్‌ను శాశ్వత సీఈవోగా నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్‌లీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జెఫ్ అలార్డైస్ ఐసీసీ జనరల్ మేనేజర్‌గా ఉంటున్నారు. గత సీఈవో మను సాహ్నిపై పలు ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జెఫ్ అలార్డైస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించింది. గత 8 నెలలుగా జెఫ్ పనితీరును పరిశీలించామని.. కరోనా క్లిష్ట సమయంలో ఐసీసీని చలా చక్కగా నడిపించారని.. అతడి నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయని గ్రెగ్ బార్క్‌లీ అన్నారు. ఐసీసీని నడిపించడానికి అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని భావించి శాశ్వత సీఈవోగా నియమిస్తున్నట్లు చైర్మన్ బార్క్‌లీ చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఐసీసీ చైర్మన్, బోర్డు సభ్యులకు అలార్డైస్ ధన్యవాదాలు తెలిపాడు. గత 8 నెలలుగా తనకు సహకరించిన ఐసీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Next Story