అద్భుతమైన పాలసీ.. ఇంట్లో ఉండి 40,000 పొందవచ్చు

by Anukaran |   ( Updated:2021-10-27 07:32:17.0  )
అద్భుతమైన పాలసీ.. ఇంట్లో ఉండి 40,000 పొందవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా రకాల పాలసీలను ప్రజల కోసం తీసుకొస్తుంది. ఆర్థిక పరమైన సమస్యలతో సతమతం అవుతున్నవారికి ఈ పాలసీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ ఎల్ఐసీ పాలసీల్లో జీవన్ ఉమాంగ్ అనే పాలసీ కూడా వుంది. ఈ పాలసీ ద్వారా లబ్ధి దారుడు ఇంట్లో ఉండి ఏకంగా ఏడాదికి నలభై వేలు పొందవచ్చును. పాలసీలో చేరినవారు నెలకు 1280 చెల్లిస్తూ ఏకంగా ఏడాదికి 40,000లు పొందవచ్చును. మరీ ఇంకెందుకు ఆలస్యం పాలసీ గురించి తెలుసుకుందాం.

పాలసీదారు అర్హతలు,ఎలా డబ్బులు పొందవచ్చు :

  • 55 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి.

  • బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి

15, 20, 25 ఏళ్ల టర్మ్‌తో అయినా పాలసీ తీసుకోచ్చు.30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 లక్షలకు బీమా మొత్తానికి 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌తో పాలసీ తీసుకుంటే, అప్పుడు నెలకు రూ.1280 ప్రీమియం పడుతుంది. 30 ఏళ్లు ప్రీమియం చెల్లించి ఉంటే మీకు 60 ఏళ్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రతి ఏడాది రూ.40 వేలు వస్తాయి. ప్రతీ నెలా కూడా 99 ఏళ్ల వరకు మీకు ఇలానే డబ్బులు మీకు వస్తాయి. అలానే 100 ఏళ్లు పడిన తర్వాత బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం అన్నీ కలిపి మెచ్యూరిటీ పొందొచ్చు. బోనస్ రూ.17.6 లక్షలు, ఎఫ్ఏబీ రూ.17.7 లక్షలు, బీమా మొత్తం రూ.5 లక్షలు మొత్తంగా రూ.40 లక్షల వరకు మీరు పొందొచ్చు.

పాలసీ బెనిఫిట్స్..

  1. పాలసీ తీసుకున్నవారు మధ్యలోనే మరణిస్తే పాలసీ డబ్బులు రావేమో అనుకుంటారు.. కానీ ఈ పాలసీ తీసుకున్న వారు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఒక వేళ అనుకోకుండా పాలసీదారుడు కనుక మరణిస్తే అప్పుడు ఆ డబ్బులు నామినీకి ఇస్తారు.

  2. 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ ని కూడా పొందొచ్చు.

  3. ఈ పాలసీ ద్వారా లైఫ్ కవరేజ్‌‌ని పొందొచ్చు. దానితో పాటు మెచ్యూరిటీ సమయంలో పాలసీ డబ్బులు కూడా వస్తాయి.

Advertisement

Next Story