- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బట్టలు ఊడదీసి కొడతారు.. బండికి జీవన్ రెడ్డి హెచ్చరిక
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల సహనాన్ని బీజేపీ నేతలు పరీక్షించాలని చూస్తే బట్టలు ఊడదీసి కొడతారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ఎల్పీ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతల తాటాకు చప్పుళ్ళకు భయపడబోమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 4500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం ఆరు వేల ఐదు వందల యాభై కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని భావించామని, అవసరమైతే మరో రెండు వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటివరకు 18 వందల కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. గతంలో రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి మాదిరిగానే బీజేపీ పరిస్థితి తయారైందని మండిపడ్డారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.