- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్.. జీవన్‌రెడ్డి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పాలిట బీజేపీ దెయ్యంలా మారిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే రేవంత్ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు బూతులకు అంబాసిడర్లుగా మారారని ఆరోపించారు. తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్తే.. రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు వకాల్తా పుచ్చుకొని బీజేపీకి బంట్రోతు అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు పరాయి పార్టీలన్నారు. తెలంగాణను తక్కువ చేసే ప్రయత్నంతోనే పార్లమెంట్లో రేవంత్ పిచ్చి ప్రశ్నలు వేశారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై పోరాటంలో విఫలమైంది కాంగ్రెస్, బీజేపీ నేతలేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘రచ్చబండ’ ఆ పతనానికి నాంది అని చెప్పారు. రేవంత్ ,తీన్మార్ మల్లన్న లాంటి చిల్లరగాళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులపై చిల్లర భాష వాడుతుండడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు.
- Tags
- bjp
- jeevan reddy