జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల..

by srinivas |
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల..
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. వారిద్దరూ విడుదవుతున్నారనే ముందస్తు సమాచారంతో కడప జైలు వద్దకు జేసీ అనుచరులు భారీగా చేరుకున్నారు. తాడిపత్రి నుంచి దాదాపు 200 వాహనాల్లో జేసీ అనుచరులు తరలివచ్చారు.

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగం కేసులో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిద్దరూ 54 రోజుల పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే, అనంతపురం కోర్టు తండ్రి, కొడుకులకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరిద్దరూ కాసేపటికి కిందటే జైలు నుంచి విడుదలయ్యారు. వీరిని తమ అనుచరులు భారీ ర్యాలీగా తాడిపత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story