పర్‌ఫెక్ట్ సస్పెన్స్‌ డ్రామా : సింగిల్ క్యారెక్టర్‌‌తో ‘సన్నీ’

by Shyam |   ( Updated:2024-06-01 14:43:40.0  )
Sunny
X

దిశ, సినిమా : మూవీ లవర్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్న ‘సన్నీ’ మూవీ గ్లోబల్ ప్రీమియర్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. జయసూర్య 100వ చిత్రంగా వస్తున్న సినిమా రంజిత్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. భావోద్వేగాల సంక్షోభంలో చిక్కుకున్న సన్నీ పాత్రలో నటించాడు. లేటెస్ట్‌గా రిలీజైన టీజర్ పర్‌ఫెక్ట్ సస్పెన్స్ డ్రామాను కలిగి ఉండగా.. సోల్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. సింగిల్ క్యారెక్టర్ సన్నీ చుట్టూ తిరిగే కథలో జీవితంలో ప్రేమ, డబ్బుతో పాటు బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయిన ఆయన.. ప్రస్తుతం ఎలాంటి పొజిషన్‌లో ఉన్నాడు? పాండమిక్ టైమ్‌లో దుబాయ్ నుంచి కేరళకు వచ్చి సొసైటీకి ఎందుకు దూరంగా ఉన్నాడు? ఏడు రోజుల వ్యవధిలో తనలో కలిగిన మార్పులేంటి? అనేది కథ. అమెజాన్ ఒరిజినల్స్‌గా వస్తున్న సినిమా సెప్టెంబర్ 23 నుంచి ప్రీమియర్ కానుంది.

Advertisement

Next Story