అర్ధరాత్రి ప్రహరీ గోడ కూల్చివేతపై ఫిర్యాదు

by Shyam |
అర్ధరాత్రి ప్రహరీ గోడ కూల్చివేతపై ఫిర్యాదు
X

దిశ, రంగారెడ్డి: శంషాబాద్‌లో భూమాఫియా రెచ్చిపోతుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద తమ భూములను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర మాజీమంత్రి కుటుంబానికి చెందిన జయప్రకాష్ అనే వ్యక్తి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు తమ భూమి ప్రహారీ గోడను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జయప్రకాష్ 1997లో సాతంరాయిలో సర్వే నంబర్ 725/ 15లో ఎకరన్నర భూమిని కొనుగోలు చేశారు. అయితే హైదరాబాద్‌కు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మూడు నెలల క్రితం జయప్రకాష్ శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు మరోసారి తమ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ప్రహరి గోడను కూల్చివేసిట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed