తల్లికి హాస్పిటల్‌లో బెడ్ దొరకలేదు.. తండ్రి పిచ్చివాడిలా పరుగెత్తాడు : నటి అనుభవం

by Shyam |
Jasmin Bhasin
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ జాస్మిన్ భాసిన్ కన్నీటి పర్యంతమైంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితిని చూస్తే హృదయం దహించుకుపోతోందని ట్వీట్ చేసింది. ప్రతీ రోజు సంభవిస్తున్న మరణాలు చూసి తట్టుకోలేకపోతున్నానని, హాస్పిటల్స్‌లో సిచ్యువేషన్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయంటూ తనకు జరిగిన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రజలు ఆస్పత్రిలో బెడ్స్, ఆక్సిజన్ కనుగొనేందుకు ప్రయత్నించే విధానం చూసి ఏడ్చేశానని తెలిపిన ఆమె.. తన తల్లిదండ్రులు కూడా ఇలాంటి దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారని వివరించింది.

అస్వస్థతతో రెండ్రోజుల క్రితం హాస్పిటల్‌కు వెళ్లిన తన తల్లికి బెడ్ దొరకలేదని, సాయం కోసం వృద్ధుడైన తన తండ్రి పిచ్చివాడిలా పరుగెడుతూనే ఉన్నాడని తెలిపింది. మెడికల్ సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారని, ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదని తెలిపింది. మన సిస్టమ్ ఫెయిల్ అయిందా? అని ప్రశ్నించింది.

Advertisement

Next Story

Most Viewed