ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు నో ఎంట్రీ

by Shyam |
ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు నో ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 2020లో ప్రేక్షకుల అనుమతిని నిషేధిస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా తీవ్రంగా వ్యాపిస్తుండటంతో ప్రేక్షకుల అనుమతిని నిరాకరిస్తున్నట్లు జపాన్ ఒలింపిక్ మంత్రి తమాయో మరుకావా గురువారం అధికారికంగా ప్రకటించారు. గతంలోనే విదేశీ ప్రేక్షకుల రాకపై నిషేధం విధిస్తున్నట్లు టోక్యో ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. అయితే స్వదేశీ ప్రేక్షకులను మాత్రం 50 శాతం మేర అనుమతిస్తామని ప్రకటించింది.

కానీ గత కొన్ని రోజులుగా టోక్యో పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే అక్కడ ఎమర్జెన్సీ తొలగించారు. ఆ తర్వాతే కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల క్రీడల కోసం జపాన్ వచ్చిన అథ్లెట్లు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దాచించబడ్డారు. గురువారం జపాన్ ప్రధాని యొషిహిదే సుగా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయ్యింది. దేశంలో నాలుగో సారి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వెంటనే ఒలింపిక్ మంత్రి ప్రేక్షకులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed