కుంగిన జపాన్ ఆర్థిక వ్యవస్థ..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో అగ్రరాజ్యాలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి. అమెరికా (America), చైనా(China) తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తించబడిన జపాన్ (japan) ప్రస్తుతం డౌన్ ఫాల్‌కు చేరింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 28.1 శాతం ఎకానమీ (Economy) క్షీణించినదని (Downfall) జపాన్ కేబినెట్ ఆఫీస్ ప్రకటించింది.

కరోనా కారణంగా ఆ దేశంలో అనేక పరిశ్రమలు(Industries), వ్యాపారాలు(Business) దెబ్బతినడంతో ఆర్థికవ్యవస్థ కుదేలైందని అధికారులు వెల్లడించారు. ప్రజల కొనుగోలు శక్తి (Buying capacity) పడిపోవడంతో వినియోగం తగ్గిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే వినియోగం, ఇతర వ్యాపారా కార్యక్రమాలు తిరిగి పుంజుకుంటున్నాయని.. త్వరలోనే జపాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.

కదలని TAXI.. వదలని EMI

Advertisement