ఈ ఒలింపిక్స్ శాపగ్రస్థమైనవి : జపాన్ ఉప ప్రధాని

by vinod kumar |
ఈ ఒలింపిక్స్ శాపగ్రస్థమైనవి : జపాన్ ఉప ప్రధాని
X

కరోనా మహమ్మారి ప్రభావంతో టోక్యో ఒలింపిక్స్ – 2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న జపాన్ ఉప ప్రధాని టారో అసో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒలింపిక్స్ శాపగ్రస్థమైనవని, 1940 నుంచి ప్రతీ 40 ఏండ్లకోసారి ఇలా జరుగుతోందని అన్నారు.

1940లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు రెండో ప్రపంచ యుద్దం కారణంగా రద్దయ్యాయి. ఆ తర్వాత 1980లో మాస్కో క్రీడలను చాలా దేశాలు బాయ్‌కాట్ చేశాయి. ఇక ఇప్పుడు 40 ఏండ్ల తర్వాత 2020 ఒలంపిక్స్‌కు కరోనా వైరస్ పెద్ద అవరోధంగా మారింది. దీన్ని ఆధారంగా తీసుకొనే జపాన్ పార్లమెంటరీ భేటీలో ఉప ప్రధాని టారో అసో ఒలంపిక్స్‌పై ఈ విధంగా వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. టారో అసో థియరీని కూడా నమ్మాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

tags : Olympics, Japan, Tokyo, Deputy PM Taro Aso, Masco, Corona

Advertisement

Next Story

Most Viewed