ఒంటరితనాన్ని జయించేందుకు.. జపాన్‌లో కొత్త మంత్రిత్వ శాఖ

by Shyam |
ఒంటరితనాన్ని జయించేందుకు.. జపాన్‌లో కొత్త మంత్రిత్వ శాఖ
X

దిశ, ఫీచర్స్ : కొందరు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే మనస్థాపం చెంది, పిరికితనంతో ఆత్మహత్యకు పాల్పడతారు. అయితే అందుకు గల కారణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుండగా, ఎన్ని కష్టాలకు వెరవకుండా ధైర్యంగా లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ఫెయిల్యూర్స్ ఎదురైనపుడు వీరికి కుటుంబ సభ్యులు అండగా ఉండటంతో పాటు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కానివ్వరు. ఇలా కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అయితే ఇటీవల జపాన్‌లో.. ఒంటరితనం కారణంగా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒంటరితనంపై పోరుకు జపాన్ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ (మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్‌ను )ను ఏర్పాటు చేసింది.

కరోనా నేపథ్యంలో 11 ఏళ్ల తర్వాత ఇటీవల దేశంలో సూసైడ్ రేటు పెరిగిందని పలు అధ్యయనాలు నిర్ధారించగా., జపాన్ ప్రధాని యోషిహిదె సుగా.. మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్‌ను అపాయింట్ చేసి క్యాబినెట్ ర్యాంకు ఇచ్చారు. 2018లో బ్రిటన్‌లో తొలిసారి ‘మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్’ నియమించబడగా, తాజాగా జపాన్‌లో ఈ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేశారు. టెట్సుషి సకమోటోకు ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. కాగా జననాల రేటును పెంచడం, ఒంటరితనం, సోషల్ ఐసొలేషన్ వంటి వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు. ఇక కొవిడ్ పాండమిక్ వల్ల ప్రజలు ఒంటరితనం ఫీలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొనగా, ఒంటరిగా ఫీలవుతున్న వారి సమస్యలు పరిష్కరించే క్రమంలో వారికి తోడుగా ఉండేలా రోబోలను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఈ తరహా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా కూడా యోచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed