లాస్ ఏంజిల్స్ వీధుల్లో Janhvi Kapoor హాట్ షో.. పిక్స్ వైరల్

by Shyam |   ( Updated:2021-11-19 04:13:32.0  )
లాస్ ఏంజిల్స్ వీధుల్లో Janhvi Kapoor హాట్ షో.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: తండ్రి బోనీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఖుషీ కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్ళిన జాన్వీ కపూర్.. అక్కడి నుంచి నేరుగా తన స్నేహితులతో కలిసి US వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు లాస్ ఏంజిల్స్‌ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్న జాన్వీ.. ఇన్నర్ వేర్స్‌తో సహా టోటల్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో గాలికొదిలేసిన కురులు, పెద్ద కళ్లతో నాలుక బయటకు తెరిచి అమ్మోరు తల్లిగా కనిపిస్తోంది. మరో పిక్‌లో ఏకాంతంగా కూర్చుని, రెస్టారెంట్‌లో కాఫీని ఆస్వాదిస్తూ కనిపించింది.

‘లాస్ ఏంజిల్స్‌లో ఒక నిమిషం కంటే తక్కువ సమయమే నా ఫ్రెండ్ హనీ ఇంట్లో ఉన్నాను’ అని రాసుకొచ్చింది. అంటే లాస్ ఏంజిల్స్‌లో విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక జాన్వీ హాట్ లుక్స్‌పై సినీ స్టార్స్‌తో పాటు అభిమానులు స్పందించారు. ‘జాన్వీ నీ అందాన్ని చూసి తట్టుకోలేను’ అని ఒకరంటే.. ‘అందమైన అమ్మోరులా ఉన్నావ్’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక జాన్వీ బ్రదర్ అర్జున్ కపూర్ ‘ప్రపంచ పర్యటన అంటే ఇది’ అని కామెంట్ చేయగా, మనీష్ మల్హోత్రా హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు.

Advertisement

Next Story