- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor : వారి నుంచి తప్పించుకోవడానికి కారు డిక్కీలో దాక్కున్నా
దిశ, సినిమా : రెస్టారెంట్ స్టైల్ క్వాలిటీ ఫుడ్‌ను మాస్టర్ చెఫ్ ఆధ్వర్యంలో పాపులర్ ఫిల్మ్ స్టార్స్ ప్రిపేర్ చేసేలా డిజైన్ చేసిన షో ‘స్టార్ Vs ఫుడ్’. ఈ షో సెకండ్ సీజన్‌కు హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ గెస్ట్‌గా హాజరైంది. ఈ సందర్భంగా తన యూత్ డేస్ నుంచి లైఫ్‌లో జరిగిన ఇబ్బందికర సంఘటనలను పంచుకుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు మీడియా ఫొటోగ్రాఫర్ల కంటబడకుండా ఎలా తప్పించుకుందో వివరించిన జాన్వీ.. ఓసారి కారు డిక్కీలో దాక్కున్న ఫన్నీ ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకుంది. ఇందుకోసమే తన కారులో ఎప్పుడూ ఒక బ్లాంకెట్ సిద్ధంగా ఉంటుందని వెల్లడించింది. షోలో భాగంగా తన ట్రైనర్ నమ్రత పురోహిత్‌తో కలిసి కొన్ని కొరియన్ డిషెస్ ప్రిపేర్ చేసిన భామ.. ఫొటోగ్రాఫర్లు బైక్ మీద వెంబడించిన రోజున కారు డిక్కీలో దాక్కోవలసి వచ్చిందని తెలిపింది.
ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ట్రైనర్ నమత్ర వివరించింది. ‘ఓ సారి జిమ్‌లో వర్కవుట్స్ ముగించుకుని వెళ్తుండగా జాన్వీ అక్కడున్న ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించుకోవాలనుకుంది. నన్ను హెల్ప్ చేయమనడంతో ముందుగా తన కారును బయటికి పంపించాం. దీంతో ఫొటోగ్రాఫర్లంతా ఆ కారు దగ్గరికి వెళ్లారు. అదే టైమ్‌లో జాన్వీ, నేను నా కారులో బయలుదేరాం. చివరకు మా కారును బైకులపై చేజ్ చేయడం మొదలుపెట్టారు. చాలా దూరం వెళ్లిన తర్వాత ఓ ప్రదేశంలో ఆపి ఆమె తన కారులోకి మారింది’ అని చెప్పింది. ఇలా చాలాసార్లు జరిగిందంటూ ఫన్నీ ఇన్సిడెంట్స్ గుర్తుచేసుకుంది.