మేకప్ ఆర్టిస్ట్‌పై కోపంతో అక్కడ తన్నిన జాన్వీ.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2021-11-29 07:20:35.0  )
Janhvi Kapoor
X

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్, తన మేకప్ ఆర్టిస్ట్‌ రివేరా లిన్‌తో కలిసి బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ పూజా మిశ్రాను ఇమిటేట్ చేసింది. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇటీవల బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ షొనాలీ నాగరాణి, పూజా మిశ్రాల మధ్య జరిగిన గొడవను జాన్వీ, రివేరా రీ క్రియేట్ చేశారు. వీడియో లో పూజా మిశ్రా మాదిరి కోపంతో ఊగి పోతున్నట్లు నటించిన జాన్వీ.. పక్కనున్న డబ్బాను గట్టిగా తన్నింది. అది వేగంగా వెళ్లి లిన్‌కు తాకింది. అప్పుడు లిన్ ‘పూజా ఈ ప్రవర్తన ఏంటి?’ అని జాన్వీని అడిగితే.. ‘అనుకోకుండా తన్నాను’ అని సమాధానమిచ్చింది. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన జాన్వీ.. ‘నాకు సాయం కావాలని మీరు అనుకుంటున్నారా?’ అనే క్యాప్షన్‌‌ జతచేసింది. కాగా ఈ వీడియోపై స్పందించిన అర్జున్‌ కపూర్‌.. ‘అవును’ అని రిప్లయ్ ఇవ్వడం విశేషం.

https://www.facebook.com/Dishacinema

అంతా విప్పితే ఎంజాయ్ చేస్తారు.. అదొక్కటి చూపిస్తే ఎందుకంత నొప్పి: స్టార్ సింగర్

జాన్వీ వైరల్ వీడియో ఇదే..

Advertisement

Next Story