ముందు మమ్మల్ని శాటిస్‌ఫై చెయ్.. జాన్వీపై నెటిజన్ల ట్రోల్స్

by Shyam |
Janhvi Kapoor
X

దిశ, సినిమా: హీరోయిన్ జాన్వీ కపూర్.. కెరీర్‌లో మరో ఇంపార్టెంట్ స్టెప్ వేసేందుకు సిద్ధమవుతోంది. ‘దఢక్’, ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాల ద్వారా బాలీవుడ్‌ను మెప్పించిన ఈ భామ.. హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతుంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘రూహి’ ఆడిషన్స్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ మేరకు కొన్ని అంతర్జాతీయ సినిమాల కోసం ఆడిషన్ కూడా ఇచ్చినట్టు తెలిపింది. ఆర్టిస్టులకు భాష, ప్రాంతం అంటూ లిమిట్స్ ఉండకూడదనే ఆలోచన తనకు ఇష్టమని.. గ్లోబల్ యాక్టర్ కావడం అనేది మన పరిధులను విస్తరించేందుకు, విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన మార్గమని అభిప్రాయపడింది.

కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ ‘రూహి’ కాగా, కచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నానని తెలిపింది. బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడటం అనే కల్చర్‌ను సజీవంగా ఉండేలా చూడాలని, అదే సమయంలో ప్రేక్షకులు సేఫ్‌గా ఉండేలా ప్రికాషన్స్ తీసుకోవడం కూడా మన బాధ్యత అన్నారు జాన్వీ. కాగా ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు జాన్వీని కామెంట్ చేస్తున్నారు. ‘ముందు ఇక్కడ శాటిస్‌ఫై చెయ్.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ గురించి చూసుకుందువు గానీ’ అని విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story