ఏపీలో మార్కెట్లకు పోటెత్తిన జనాలు

by srinivas |   ( Updated:2020-03-21 05:59:16.0  )
ఏపీలో మార్కెట్లకు పోటెత్తిన జనాలు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయం ఆందోళన రేపుతోంది. మూడు కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడంతో ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ విధించారు. దీనిని ఎలాగైనా విజయవంతం చేయాలని, తద్వారా దేశభక్తిని చాటాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు.

రేపు కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం ప్రజలంతా రోడ్డెక్కారు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. రేపు మార్కెట్లన్నీ క్లోజ్ కావడంతో కూరగాయల మార్కెట్లకు, రైతు బజార్లకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.

విజయవాడ, వైజాగ్, తిరుపతితోపాటు 13 జిల్లాలు, మండల కేంద్రాల్లో ఎటు చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు పెట్రోలు బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. బంకులు కూడా బంద్ అన్న నేపథ్యంలో నేడే పెట్రోలు నింపుకుని దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా భయం నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కంపెనీలు కల్పిస్తుండడంతో పట్టణవాసులంతా పల్లెలకు పరుగులు తీస్తున్నారు. దీంతో పల్లెవాసులు ఆందోళన చెందుతున్నారు.

tags : corona, covid 19, janata curfew, markets busy

Advertisement

Next Story

Most Viewed