నేడు ‘నివర్’ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన

by srinivas |
నేడు ‘నివర్’ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 2వ తేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జనసేనాని పర్యటన సాగనుంది. తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డలో పంటనష్టం వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు కొలకలూరుల్లో పవన్ పర్యటిస్తారు.

Advertisement

Next Story

Most Viewed