జగన్ కు దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయమను: నాదెండ్ల మనోహర్

by srinivas |
జగన్ కు దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయమను: నాదెండ్ల మనోహర్
X

దిశ-ఉత్తరాంధ్ర : పార్టీబలోపేతానికి జనసైనికులు అందరూ కంకణం కట్టుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన జనసైనికుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జనసేన పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు. జనసైనికులకు 25 కేజీలు బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవిష్యత్ కావాలంటే జనసేన రావాలని తెలియజేసారు. జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వలనే ఇసుక కొరత ఏర్పడిందని, జాబ్ క్యాలెండర్ మూడు సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. రోడ్లు అద్వాన్నంగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం.. రోడ్ల కోసం కోట్లరూపాయలు వెచ్చించామని కాకి లెక్కలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్లు విషయంలో అక్టబర్ 2 న స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి శ్రమదానం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసారు. అధికార పార్టీ బెదిరింపులకు జనసైనికులు భయపడకుండా ముందుకు సాగాలని కోరారు. 30 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రి అని జగన్ కలలు కంటున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని తెలియజేసారు. చిన్న చిన్న సమస్యలను వాళ్ళ స్వార్ధ కోసం వాడుకుంటున్నారని

150 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది సినిమా టిక్కెట్ల అమ్మకం కోసమా అని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా పవన్ సీఎం కావాలి.. అందుకు అందరూ కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story