వరలక్ష్మి హత్య బాధాకరం : పవన్ కళ్యాణ్

by Anukaran |
Janasena chief Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: గాజువాకలో వరలక్ష్మి అనే యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని హత్య బాధాకరం అన్నారు. ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఫలితం రాదు అని వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కూల్ స్థాయి నుంచే యువతులకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పించాలని సూచించారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు.

Advertisement

Next Story