‘ఆ ఆవేదన మాటలకు అందనిది’

by Anukaran |   ( Updated:2020-11-02 11:17:00.0  )
‘ఆ ఆవేదన మాటలకు అందనిది’
X

దిశ, వెబ్‌డెస్క్: అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం.. ఏమిటీ పశువాంఛ? ఎక్కడికి పోతోంది మన సమాజం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రాయలపేటలో జరిగిన ఈ సంఘటన వినడానికే భయంకరంగా ఉందన్నారు. ఆ పసిపాప పరిస్థితి ఊహించుకుంటే గుండెలు భారంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృగాడి పైశాచికత్వానికి బలైపోయిన ఆ అభాగ్యురాలు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోందని గుర్తు చేసిన జనసేనాని.. ఆ వీడియో చూసినప్పుడు కలిగిన ఆవేదన మాటలకు అందనిదని చెప్పారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఆడపడుచుల పై ఎందుకు దాడులు జరుగుతున్నాయన్నారు. ఎప్పుడో పడే శిక్షలకు దుష్టులు భయపడటం లేదా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సామాజిక వేత్తలు, మహిళా సంఘాలు గళం విప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story