- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో జానారెడ్డి
దిశ,హాలియ: 137 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అనుముల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ CLP నేత కుందూరు జానారెడ్డి హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ..ఎడ్ల బండి నుంచి ఎయిర్ బస్ దాకా,టెలిగ్రామ్ నుంచి స్మార్ట్ ఫోన్ దాకా,పూరి గుడిసె నుంచి ఇందిరమ్మ ఇళ్లు దాకా,నాటు వైద్యం నుంచి ఆరోగ్యశ్రీ దాకా,చెరువుల నుంచి ప్రాజెక్టుల దాకా,తెల్ల దొరల కబంధహస్తాల నుంచి భారతమాతను విముక్తి చేసిన పార్టీ,తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీ,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో పథకాలు,కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి,టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంపటి శ్రీను, స్థానిక కౌన్సిలర్లు పిల్ల అంజనేయులు, గౌని రాజ రమేష్ యాదవ్, తక్కలపెల్లి సైదులు, వైస్ ఎంపీపీ మాలే అరుణ, సత్యనారాయణ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల కృష్ణ,మాజీ సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్,డైరెక్టర్ కుందూరు శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మజహార్ మోహినుద్దీన్, పాంపటి శ్రీనివాస్,కుందూరు రాజేంద్రరెడ్డి, గడ్డం రమణయ్య, స్వామి నాయక్, మిట్టపల్లి వాసులు, పోశం వెంకట్ రెడ్డి, నకిరేకంటి సైదులు మాదిగ, వర్కాల శ్రీనివాస్ రెడ్డి, నామిని సుధాకర్, వర్కాల మల్లారెడ్డి,వడాల లక్ష్మయ్య, వినయ్ కుమార్, సాజిద్, గార్ల పార్టీ గోవర్ధన్, మట్టా రెడ్డి, గార్లపార్టీ శేఖర్, గోవర్ధన్ రెడ్డి, బొంగరాల యేసురాజు, ఆనంద్ చౌదరి, విగ్నేష్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.