- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ నేత పదవికి రాజీనామా.. ఈటల కోసమేనా..?
దిశ, జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సురేందర్ రాజు బుధవారం తన పదవికి రాజీనామా చేసి, ఆ పత్రాన్ని మార్కెట్ కమిటీ కార్యదర్శికి అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సురేందర్ రాజు తన పదవికి రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు తెలిపేందుకు రాజీనామా చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సురేందర్ రాజు గతంలో జమ్మికుంట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా, ఉప సర్పంచ్‌గా పనిచేశారు. జమ్మికుంట పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, నిరుపేదలకు స్థలాల కోసం జమ్మికుంట నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టడంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఏదీ ఏమైనప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో సురేందర్ రాజు రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.