సూర్యకు తమిళనాడు సీఎం లేఖ.. కారణాలు వివరించిన హీరో

by Shyam |   ( Updated:2021-11-02 04:06:24.0  )
surya jai bhim
X

దిశ, సినిమా: జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య, రాజీషా విజయన్‌ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘జై భీమ్‌’. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమాను చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెండు పేజీల ప్రశంసాపత్రాన్ని పంపించినట్లు తెలిపారు సూర్య. సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రం అవుతుందని అభినందించారని వివరించారు. 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య స్వయంగా నిర్మించిన ఈ చిత్రం… 1993లో ఓ గిరిజన మహిళకు న్యాయం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రు ఆమె తరపున వాదించిన కేసు ఆధారంగా రూపొందింది.

అలాగే గిరిజన ప్రాంతాల్లో ‘జై భీమ్‌’ షూటింగ్‌ చేయడం గొప్ప అనుభూతి ఇచ్చిందన్న సూర్య.. ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సంజయ్ స్వరూప్ అద్భుతంగా నటించారని తెలిపారు. ఇక ఇటీవల తమిళనాడుకి చెందిన ‘ఇరుళర్‌’ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కు సూర్య-జ్యోతిక రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story