- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్ఆర్ఎస్‌పై నిర్ణయాన్ని మార్చుకోవాలి: జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరణి, రిజిస్ట్రేషన్ల అంశంలో చాలా ఇబ్బందులకు గురి చేశారని, కానీ పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఇక ఎల్ఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకోవడమే మిగిలిందని, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై తన నిర్ణయాన్ని మార్చుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎల్ఆర్ఎస్‌కు డబ్బులు కట్టలేరని, కరోనాతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నారని, కొన్ని ఏండ్ల కిందట రెండు, మూడు లక్షలకు ప్లాట్లు కొన్న వారు ఇప్పుడు అదే ధరతో ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి వస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఎల్ఆర్ఎస్ భారం కాకుండా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని, రూ. 10వేల నామమాత్రపు రుసుముతో ఇళ్లు, ప్లాట్లు రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.