- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్ణయం మార్చుకోండి.. ప్రధానికి జగన్ డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరిన జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో జగన్ కోరారు. నిన్న పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్.. నిర్మలా సీతారామన్ ప్రకటన ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేసిందన్నారు.
‘స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం మార్చుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20 వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్ ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు.
కాగా , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని, ఖచ్చితంగా ప్రైవేటీకరిస్తామని నిన్న పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో విశాఖలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. రోడ్డుపై టైర్లను తగలబెట్టడంతో పాటు స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోకి దూసుకెళ్లారు. ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారిన క్రమంలో మోదీకి జగన్ లేఖ రాయడం గమనార్హం.