- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వైఎస్సార్ రైతు భరోసా’.. 18 నుంచి నగదు జమ
దిశ, ఏపీ బ్యూరో: రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం శుక్రవారం నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 49,43,590 రైతు కుటుంబాలకు ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.5,500 చొప్పున ఖాతాల్లో జమచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 2,800 కోట్ల రూపాయలను విడుదల చేసిందని వెల్లడించారు. మే నెలలోనే మొత్తం రూ.7,500 ఇవ్వాలనుకున్నామనీ, కానీ కరోనా కారణంగా ఏప్రిల్‌లో 2వేలు ఇచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతు కుటుంబాలతోపాటు అటవీ ప్రాంతంలో భూములు సాగు చేసుకునేవారికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ నెల 18 నుంచి విత్తనాల విక్రయం మొదలుకానున్న నేపథ్యంలో వాటి కొనుగోలుకు వీలు కల్పించే విధంగా నగదు జమ చేశామని చెప్పారు.
బ్యాంకుల నుంచి ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయొచ్చు
రైతు భరోసా సొమ్మును రైతుల పాత అప్పుకింద జమ చేసుకోవద్దని బ్యాంకు అధికారులకు ముందే చెప్పినట్టు తెలిపారు. అయినప్పటికీ బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులుంటే 1902 నెంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 30న 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రాల్లో రైతులు ఏయే పంటలు వేయాలనే సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. వేసిన పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంటుంది, ఎలా మార్కెట్ చేసుకోవాలన్న విషయాలు చెబుతారని వెల్లడించారు. అక్టోబర్ నెలలో 2వ విడతగా రబీ సీజన్ పంటల అవసరాల నిమిత్తం, అలాగే 3వ విడతగా సంక్రాంతికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్టు చెప్పారు.
పంట అమ్మకాలను జనతా బజార్లు
వచ్చే ఏడాది చివరి నాటికి గ్రామ సచివాలయం పక్కన పంటలు విక్రయించేందుకు వైఎస్సార్ జనతా బజార్లు ఏర్పాటు చేయనున్నామనీ, ఇవి రైతులకు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. గ్రామస్థాయిలోనే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసేస్థాయికి తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 174 లక్షల టన్నులకు పెరిగిందని వెల్లడించారు. సాగు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో మార్పులు తీసుకురానున్నామని చెప్పారు. రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.