సినిమా టికెట్ల కొత్త రేట్లను ప్రకటించిన జగన్ సర్కార్.. ఇకపై నో బెనిఫిట్ షోస్..

by srinivas |
సినిమా టికెట్ల కొత్త రేట్లను ప్రకటించిన జగన్ సర్కార్.. ఇకపై నో బెనిఫిట్ షోస్..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు సంబంధించిన బిల్లు ఇటీవలే అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రాంతాల వారీగా టికెట్ల ధరలను నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం అత్యంత గరిష్టంగా రూ.25 కాగా.. అత్యంత కనిష్ట ధర రూ.5 గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తేల్చిచెప్పింది.

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో

మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీ ప్రాంతాల్లో

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీల్లో

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5

ఇకపోతే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బెనిఫిట్ షోలను రద్దు చేసింది సర్కార్. ఇకపై సినిమా హాళ్లలో నాలుగు షోలు మాత్రమే నడవనున్నాయి. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తక్కువ రేటుకు సినిమా టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పేర్ని నాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల సినీ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story