ఆ ఎన్ కౌంటర్ బూటకం.. జగన్ లేఖ వైరల్

by Shyam |   ( Updated:2021-10-25 04:42:25.0  )
mavoistulu-12
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకుల గూడెం అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా ప్రకటించారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరిని నిర్వహించి తమ ప్రభుత్వం గొప్పగా చేసిందని చెప్పుకుంటుందన్నారు. ఒక వైపు పేదల పక్షాన ఉన్నామనడం, బూటకంమని జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అడవుల్లో నెత్తురోడిస్తూనే మరోపక్క కల్లబొల్లి మాటలతో ప్రజలను టీఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని లేఖలో తెలిపారు. ఈ ఎన్ కౌంటర్‌లో రీజనల్ సెంటర్ సీఆర్‌సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్స్ నరోటి దామాల్ (ppcm)మహారాష్ట్ర గడిచిరోలి జిల్లా గట్ట ఏరియా, పూనెం బద్రు గ్రామం పెద్ద కోర్మ జిల్లా బీజా పూర్, సోడి రామాల్ (సంతోష్) బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లి పాడుకు చెందిన వారు మరణించినట్టు లేఖ ద్వారా జగన్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed