జగన్ గుడ్ న్యూస్.. ఆ పథకాల అమలు అప్పుడే..

by srinivas |   ( Updated:2021-09-22 06:38:14.0  )
జగన్ గుడ్ న్యూస్.. ఆ పథకాల అమలు అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి స్వయంగా పరిశీలిస్తానని, సచివాలయాల్లో తనిఖీలు చేపడతానని తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయాలను సందర్శించాలని, సచివాలయాలపై అలసత్వం వద్దన్నారు. విజయదశమి రోజున ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 19న జగనన్న తోడు కార్యక్రమం, అక్టోబర్ 26న రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ రుణాలు, డిసెంబర్ 21న జగనన్న గృహ హక్కు పథకం ప్రారంభించనున్నట్లు జగన్ పేర్కొన్నారు.

వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా మార్చినట్లు జగన్ చెప్పారు. నవంబర్ నాటికి 3.5 కోట్ల మందికి ఫస్ట్ డోస్, ఫిబ్రవరికి రెండు డోసులు ఇవ్వగలుగుతామన్నారు. చరిత్రలో లేని విధంగా పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. అవినీతిని ఏరిపారేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed