- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఉద్యోగులకు లేదా కుటుంబ సభ్యులకు కరోనా సోకితే సెలవులు ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
దీంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఉద్యోగి తల్లిదండ్రులకు, అతనిపై ఆధారపడి జీవించేవారికి కొవిడ్ పాజిటివ్‌గా వస్తే.. 15 రోజులు స్పెషల్ లీవ్ ఇవ్వాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story