- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 29 పథకాలు రద్దు చేసింది.. వర్ల రామయ్య
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా దళితులను అన్ని విధాలా మోసం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలపై సీఎస్ సమీర శర్మకు లేఖ రాశారు. రెండున్నరేళ్లలో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దు చేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుందని వర్ల లేఖలో పేర్కొన్నారు. ఆ నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినా.. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అయ్యిందని.. అందువల్లే తమరు దృష్టికి తీసుకువస్తున్నట్లు వర్ల రామయ్య లేఖలో స్పష్టం చేశారు.
Advertisement
Next Story