22న ముహూర్తం.. ఆ అవకాశం ఎవరికో ?

by srinivas |
22న ముహూర్తం.. ఆ అవకాశం ఎవరికో ?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. రాజ్యసభ ఎంపీలుగా ఎంపికైన నేపథ్యంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ రాజీనామాలు చేశారు. అవి ఆమోదం కూడా పొందాయి. దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను ఈ నెల 22న భర్తీ చేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. బీసీ వర్గానికి చెందిన రెండు మంత్రి పదవులు ఖాళీ కావడంతో ఆ స్థానంలో మళ్లీ బీసీలనే నియమిస్తారన్న ఊహాగానాల నడుమల ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. అయితే పార్టీ అధినేత ఎవరిని కరుణించి అందలమెక్కిస్తారో తెలియన పరిస్థితి నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని బీసీ వర్గానికి చెందిన నేతలకే పదవులు దక్కే అవకాశం ఉండగా, రెండింటితో పాటు ఇంకా కొన్ని పదవులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21తో ఆషాఢం ముగిసి శ్రావణం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణకు అదే మంచి ముహూర్తమని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story