- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలలో మూడు సార్లు రేషన్ ఇస్తా: జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఆకలితో అల్లాడకూడదని తాను కోరుకుంటానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీలో కూడా లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలను కూడా ప్రకటించినప్పటికీ.. ఈ సౌకర్యాలు సరిపోవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు నెలలో మూడు సార్లు నిత్యావసరాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా ఆదివారం నాడు బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయనున్నారు. ఆపై ఏప్రిల్ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తారు. ఏప్రిల్ 29న మూడో విడతగా బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తారు. అంతేగాకుండా, ఏప్రిల్ 1నే రాష్ట్రంలో పింఛన్లు ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఏప్రిల్ 4న పేదలకు రూ.1000 చొప్పున ఇస్తామని తెలిపారు.
Tags : ap, jagan, ration, 3 times ration, jagan announces 3 times ration in ap