గంటా ఎంట్రీకి జగన్ 2 కండిషన్స్…?? 

by srinivas |
గంటా ఎంట్రీకి జగన్ 2 కండిషన్స్…?? 
X

ఆది నుండి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్లోగన్ ఒకటే… మా పార్టీలోకి రావాలంటే ఏ పదవిలో ఉన్నా రాజీనామా చేసి రావాలి. ఎన్నికల ముందు వరకు అదే ఫాలో అయ్యారు కూడా…! అయితే కొద్ది రోజులుగా గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరనున్నారని గట్టిగా వినిపిస్తున్న మాట. కానీ గంటా ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఆయన గంట కొడతారని గంటా శ్రీనివాసుకి మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు పార్టీ ఏదైనా… నియోజకవర్గం ఏదైనా… గంటా నిలబడితే గెలుపు ఖాయం. సినిమా డైలాగ్ లా ఉన్నా ఇది నగ్నసత్యం. మరి ఇలాంటి నాయకుడు ఏ పార్టీలో చేరతా అన్నా సాదర ఆహ్వానం ఉంటుంది కానీ కండిషన్లు ఉంటాయా?

ఉండొచ్చేమో… ఎందుకంటే అవతల ఉన్న పార్టీ అధినేత కూడా అంతకుమించి కదా..! ఎంతటి నేతైనా సరే… సొంతగూటిని వదిలి రావాలంటే.. ఆ పార్టీకి నీళ్ళొదిలేసి పవిత్రంగా వస్తేనే నీలి కండువా కప్పి వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఇస్తారు జగన్. ఇప్పుడు గంటా విషయంలోనూ అదే తరహా పద్దతి పాటిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఫుల్ మెజారిటీతో విన్ అయిన వైసీపీకి లాబీయింగ్ చేసి ఎమ్మెల్యేలను పార్టీలోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగని బడా నేతలు పార్టీలో చేరతా అంటే… మావాళ్లు వ్యతిరేకిస్తున్నారు కదా వద్దులే అనుకునే మెతక మనిషి కాదు జగన్. అందుకే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుని మరీ తెచ్చుకునే వ్యూహం రచించారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

రెండు కండిషన్లు… ఇద్దరికీ రెండు లాభాలు. ఒకటి గంటా టీడీపీకి రాజీనామా చేయాలి. రెండు ఎన్నికల్లో ఓడిపోయిన విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థిని మళ్ళీ వైసీపీ తరపున నిలబెట్టి గెలిపించాల్సిన బాధ్యత గంటాదే. దీంతో గంటా ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వైసీపీ శ్రేణులను కూడా సంతృప్తి పరచొచ్చు అని జగన్ ఆలోచిస్తున్నారట.

అప్పటిదాకా గంటాను వ్యతిరేకించినవారు కూడా సర్దుకుపోవడంతో గంటాకు వైసీపీలో గౌరవప్రదంగా స్థానం దక్కడంతో పాటు… ఒక నామినేటెడ్ పదవి. ఇరువురికీ లాభం చేకూరినట్టు అవుతుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గంటా ఈ కండిషన్స్ ని ఒప్పుకుంటారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే…

Advertisement

Next Story